Thursday, July 25, 2013

నీకోసమే నిరీక్షణ ...... వ్రుద అని తెలిసినా

            

  మొండితనమా! వెర్రితనమా!
పిచ్చితనమా! పెంకితనమా!
వద్దంటున్నా వేదిస్తున్నా ప్రణయమా.....
నా మదిలో అలజడి రేపే ప్రళయమా.....
నువ్వు నా స్నేహమా! లేక శాపమా!
అసలెందుకీ నరకమా....
                 ఓ ప్రియతమా....



   
నాకొద్దు, నను వదలొద్దు....
                అంటున్న ఓ ప్రెమపైత్యమా...........!
   మనసునే గాయపరిచేసి..... 

                అంతలోఆశ రేపేసీ.....!

 


మౌనమై నను వేదించేసే.....
                          ఒంటరి పోరాటమా..................!
ఎందుకమ్మ నీకీ ఆరాటం , ఎవరి కోసం పోరాటం.......
నిను వలదని వెళ్తున్నా మనసుని విడువుమా.....
          ఇంకెంతకాలం........ఎంతెంతకాలం.
                        ఓ మౌనమనోవేదన ....ప్రేమా..............!





                            విడదీసెనే విధి సైతం    -    వీడలేకున్నాను నా హ్రుదయం

Saturday, July 20, 2013


                        నువ్వే నా సర్వం .... నీతోనే సర్వస్వం



వీడిపోకు ప్రియతమ
     వదిలి వెళ్ళకు చైత్రమ......
 నువ్వంటే నాకు ప్రాణమే
     నీతో ఉంటే నాకు స్వర్గమే.....
నువ్వు హత్తుకున్న ఆ క్షణం
     నేను మరిచాను  ఈ ప్రపంచమే.....
ఓ నేస్తమ ! నా సర్వస్వమా
నీ కోసం ఏదైన చేయ్యుట సులభం
కాని ,
         నిన్ను మరువమన్న ఆ క్షణం....
                  నా మరణం నాకెంతో సుఖం.......
                                                             

                                       నీకు ఈ ఙాపకాలు మరిచి జీవించుటకు ఒక్క 
     అర క్షణం చాలునేమో..........

కానీ,
ఆ ఙ్యాపకాలే నాకు ఊపిరి పోస్తున్నాయని నీకు తెలుసో లేదో
నేస్తమా.........
అవి , నేను మరువాలన్న , మరిచి జీవించాలన్న
ఈ జన్మ చాలెదేమో...........
                          ప్రణయమా..... నా హృదయమా........


Thursday, May 16, 2013



                                      నీకై  .....  నేను

 
నుక్షనం నీ ఆలొచన....
ప్రతి క్షణం నీ
దర్శనం....
ఇక ఎక్కడ నాకై నేను జీవించడం....
       ఈ వేదన...
           ఆవేదన...
                అరె ఎంతో ఆనందంగా ఉందే.....
నీ కోసమై ఆలాపన...

అద్రుష్టం అనిపిస్తుందే...
                      నా మనస్సుకి...........

నువ్వు చెప్పిన ఊసులు తలచుతు....                        

 ఆ భాసలలోనే బ్రతుకుతు....
                                నీతో... నడిచే క్షణముకై....         
వేచి చూస్తున్న....
            నేస్తమ...
                   నా ప్రియతమ.......
కలకాలం నీతో ఉండాలని....              
కడకాలం నీ ఒడిలో సేద తీరాలని....
నీ తోడై నేను నిలవాలని....
నా నీడై నువ్వు నడవాలని....

ఏవేవో ఆలోచన ఊహలతో....                               
                    నడుపుతున్న ప్రతీక్షణం......
                    గడుపుతున్న ఈ సమయం..........


Wednesday, February 24, 2010

ఏంబిఏ బ్యాచ్





స్నేహం

ఓ వరం ...

కోపతాపాలు కోమన్

ప్రేమతో వాటిని మన్నిస్తే

ఉత్సాహం మన సొంతం

ఉల్లాసం మా(వ,క,త,క,ప్ర,మ,ఉ,జ)

జీవితాంతం .................

Friday, August 14, 2009

పట్టుదలతో ఉంటే సాదించలేనిది ఏది ఉండదు




"జివిత సూత్రం - జీవన మార్గం "


ఈ జీవితం సాగే పయనం ఎటు వేళ్ళిన ఆరాటం, పోరాటం

ఎక్కడికి వేళ్ళాలన్న తెలియని భయాందొళనం


ఎటు చూసిన అయొమయం

ఏది చేసిన ఎదురవుతున్న నిరాశ, నిస్ప్రుహతనం

కాని,

ఏదో చెయ్యాలన్న పట్టుదల ఒక్కటే
......

ఈ జీవితాన్ని ముందుకు నడిపే ఆయుధం

అది తెల్సుకొన్ననాడె ప్రతీ వ్యక్తి యొక్క జీవితం


ఆనందమయం.......

Tuesday, August 11, 2009

స్నేహం





స్నేహం అనంత దూరల సైతం అంతం చెయ్యగలిగెది

క్రౌర్యాని సైతం శాంతంతొ జయించగలిగెది

విషాదాన్ని సైతం ఆనందంతొ నింపేది

విషాన్ని సైతం అమృతంగా మార్చేది

వివాదాన్ని సైతం వివేకంతొ గెలిచేది

అపజయాన్ని సైతం జయంతొ పొరాడేది

అవరోదాన్ని సైతం అధిగమించేది

కసిని సైతం కర్పూరంలా కరిగించేది

స్నేహం ఒక్కటే .....

నిజమైన , నిజాయితి అయిన ,నిరాడంబరమైనదే ఆ స్నెహం .....

ఎంత అనుభవమైన , ఐస్వర్యమైన తలవంచేది

అటువంటి స్నెహానికే .....

ఆ స్నేహం తులసికన్న పవిత్రమయినది

అశోక చక్రం కన్న దీటయినధి

అలాంటి స్నెహం ప్రతి ఒక్కరిచే ఆస్వాదింపబడాలని

నా ఆకాంక్ష.....

Friendship day wishes




అనురాగానికి ప్రతిరూపం


అభిమానానికి నిర్వచనం

ఆప్యాయతలో ఆదర్శం

పంచగలిగేది , చుపగలిగేదే స్నేహం

అటువంటి స్నేహం అందరకి దొరకని వరం

పొందినప్పుడే గుండె గూటిలో చేసుకోవాలి పదిలం .........


" స్నేహోత్సవ శుభాకాంక్షలు "